మూడు నెలల నుండి అందని రేషన్..
1 min read– సమస్య పరిష్కరించాలని ముస్లిం మహిళల ఫిర్యాదు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గత మూడు నెలల నుండి మండల కేంద్రంలోని గడివేముల గ్రామం లో ముస్లిం కాలనీ ఏరియాలో రేషన్ వాహనం రావడం లేదని శుక్రవారం నాడు తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గురు నాథ్ కు ముస్లిం మహిళలు ఫిర్యాదు చేశారు ఎండియూ వాహనం ద్వారా ఇంటి వద్దకే ప్రతినెల ఒకటో తేదీ కల్లా తమకు రేషన్ అందించే వారని కానీ మూడు నెలలుగా రేషన్ బియ్యం కోసం వేరే వాహనాల వద్ద వెళ్లి తీసుకుంటున్నామని సమస్యపై స్పందించిన డిప్యూటీ తాసిల్దార్ రేపు సాయంత్రం కల్లా మీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్య అంత రేషన్ డీలర్లు వాహన ఆపరేటర్ల మధ్య సివిల్ సప్లై నంద్యాల గో డౌన్ నుంచి వచ్చే బియ్యం ప్యాకెట్లలో తూనికలు తక్కువ వస్తున్నాయని షార్టేజ్ రావడంతో ఎం డి యు ఆపరేటర్లు వాహనాలలో ప్రజలకు రేషన్ అందివ్వడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆసక్తి చూపడం లేదని ఈ సమస్యను సివిల్ సప్లై డి టీ దృష్టికి తీసుకు వెళ్లినట్టు ఎం డి యు ఆపరేటర్లు తెలిపారు ముఖ్యంగా రెండుసార్లు వేలిముద్రలు సర్వ సమస్యతో ఆన్లైన్ పనిచేయకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆపరేటర్లు తెలిపారు.