కారల్ మర్క్స్ నగర్ ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తా… టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తాను ఎమ్మెల్యే అవ్వగానే కారల్ మర్క్స్ నగర్ ప్రజల సమస్యలు తీరుస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని 48 వ వార్డులోని కారల్ మర్క్స్ నగర్లో ఆయన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు వారి సమస్యలను టి.జి భరత్ తో మొరపెట్టుకున్నారు. ప్రజల సమస్యలు తీరాలంటే తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నేను అధికారంలోకి వస్తే సమస్యలు తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు. కర్నూల్లోని చాలా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు మారుతాయన్నారు. ఓటు వేసే సమయంలో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. ఎవరో చెప్పే మాయమాటలు నమ్మొద్దని సూచించారు. ఇంటింటికి వచ్చి ప్రజలను కలిసిన టిజి భరత్ కు స్థానికులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. పబ్లిక్ కుళాయిలు లేవని చెప్పారు. హౌసింగ్ బోర్డ్ లో ఇరుక్కుపోయిన ఇళ్ల పట్టాలు విడిపించాలని కోరారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు ఏదైనా ఏర్పాటు చేయాలని కోరగా.. టిజి భరత్ స్పందించి కమ్యూనిటీ హాల్ తరహాలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మన్సూర్ ఆలీఖాన్, అబ్దుల్, గుర్రప్ప, సద్దాం, అంజాద్, భాస్కర్, మద్దిలేటి, నాయుడు, హుసేన్, మహమ్మద్, చిన్న బాషా, తదితరులు పాల్గొన్నారు.