ఆహ్లాదకరంగా పాలుట్ల రంగనాథ స్వామి ఆలయం
1 min readపల్లెవెలుగు వెబ్ వెల్దూర్తి: వెల్దుర్తి మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామ సమీపన రాతి అందాల మధ్యన వెలసిన పాలుట్ల రంగనాథ స్వామి ఆలయం ప్రస్తుతం కురిసిన వర్షాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో భక్తులకు స్వాగతం పలుకుతుంది. ముఖ్యంగా కొండపై నుంచి వచ్చే సెలయేటి అందాలతో పాటు రాతి అందాల మధ్యన శ్రీదేవి భూదేవి సమేత పాలుట్ల రంగనాథ స్వామి ఆలయం భక్తులకు కనువిందు చేస్తుంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు.