PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 13న ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఎన్నికలు..

1 min read

నేడు రేపు నామినేషన్ ప్రక్రియ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ది ఏలూరు టౌన్ ఆటో మొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 13వ తేదీన జరగనున్నాయి, 7 -10- 2023 శనివారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని సంఘ సభ్యులు తెలియజేశారు, ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లు గడువు ఉంటుందని తెలిపారు. ఆటోనగర్ సభ్యులైయుoడి, స్థానికంగా స్థలం ఉండి ఓటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఎలక్షన్లో పోటీ చేయటానికి అర్హులు అన్నారు, ప్రారంభం తేదీ 7 10 2023 ,ముగింపు తేదీ 8 10 2023, నామినేషన్లు ఉపసంహరణ తేదీ 10 10 2023, ఎన్నికల తేదీ 13 10 2023 సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆటోనగర్ “బి”బిట్ సంఘ ఆఫీస్ నందు నిర్వహించబడతాయన్నరు. 13 10 2023న జరుగు సంఘ సర్వసభ్య సమావేశము నందు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించబడతాయన్నారు. ఎలక్షన్ కమిటీ ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా సంఘ సభ్యులు తెలియజేశారు. ఈరోజు నామినేషన్ వేసిన వారు ప్రెసిడెంట్ గా కర్రీ నాగేశ్వరరావు (అరుణతార), సెక్రటరీగా అడపా సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీగా మర్రపు సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గా కుప్పల ముకుందరావు ఎన్నికల అధికారులకు నామినేషన్లు దాఖలు చేశారు.

About Author