ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది
1 min read– సన్మాన కార్యక్రమంలో ఎంఈఓ-2
పల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: విద్యార్థుల సామర్థ్యం పెపొందించుటలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని ఎంఈఓ-2 సునీత అన్నారు, శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొక్కరాయపల్లె నందు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా పరిషత్ సభాభవనం నందు అక్టోబర్ 5 న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుస్వీకరించినప్రధానోపాధ్యాయురాలు హేమలత ను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి-2 సునీత మాట్లాడుతూ, విద్యార్థులతో మమేకమై వారికి విద్యాభ్యాసం అందించడంలో ఉపాధ్యాయుల పనితీరు అభినందనీయమన్నారు, సందర్భంగా ఆమె ఉపాధ్యాయు రాలు హేమలతను అభినందించారు, అవార్డు స్వీకరణ ఉపాధ్యాయులకు మరింత భాద్యత పెంచుతుందని, విద్యార్థులలో సామర్థ్యాల పెంచుటకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలన్నారు,విద్యాశాఖలో ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన సాంకేతిక పద్దతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు అప్డేటెడ్ గా ఉంటూ మండలానికి మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవణయ్య, వీరనారాయణ,రిటైర్డ్ హెచ్. యం.రామచంద్రయ్య, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ రెడ్డెమ్మ, గ్రామ సర్పంచ్, సూర్య నారాయణ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.