PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపిని ఓడించండి… వామపక్షాలను బలపరచండి 

1 min read

రెడ్ ఫ్లాగ్ జాతీయ నేత ఉన్ని  చెక్కన్‌  పిలుపునిచ్చారు

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: రాబోయే ఎన్నికలలో బిజెపిని , , లౌకిక శక్తులను బలపరచాలని రెడ్ ఫ్లాగ్ జాతీయ నాయకులు పి సి ఉన్ని చెక్కన్ పిలుపునిచ్చారు. మహాసభలు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మహాసభలో ప్రారంభోత్సవ చేస్తూ మాట్లాడారు. రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంగించే బిజెపిని తక్షణమే గద్దె దింపాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన సాగటం లేదని ఆవేదన చెందారు. ,జర్నలిస్టులు, ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్న బిజెపి మతోన్మాదులని ఓడించటం తక్షణ కర్తవ్యం అన్నారు. లేదంటే ప్రజాస్వామ్యం పరిరక్షించబడదని, చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సార్వభౌమాధికారం కాపాడాలంటే బిజెపిని ఓడించాలన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం కాపాడాలంటే బిజెపిని గద్దించటం .అవసరముందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి సాగాలంటే బిజెపిని పారద్రోలని అన్నారు. బిజెపి ఈ దేశానికి పట్టినగ్రహణమని హేళన చేశారు. రెడ్ ఫ్లాగ్ పార్టీని బలోపేతం చేయడానికి మహాసభలు నిర్వహిస్తున్నామని, పదో మహాసభలు విజయవాడలోనే డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరుగుతాయని తెలిపారు. కేంద్ర కార్యవర్గ సభ్యులు థామస్ ఫ్రెడ్డి మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ పరిణామాల్ని పార్టీ సభ్యుల అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక పరిణామాలు, ఆర్థిక స్థితిగతులు అధ్యయనం చేయకపోతే పార్టీలో పని చేయలేమని, పార్టీ అభివృద్ధికి కృషి చేయలేమని సభ్యులకు సూచించారు. ఇందుకోసం పార్టీ సభ్యులు ఎక్కువ సమయం వెచ్చించి పార్టీ బలోపేతానికి ప్రజల పార్టీగా నిర్మాణం చేయడానికి కృషి చేయాలని కోరారు. కేంద్ర కార్యవర్గ సభ్యులు బసవలింగప్ప మాట్లాడుతూ గత మహాసభల కన్నా ఈ మహాసభలకి ఆంధ్ర,  రాష్ట్రాలలో రెడ్ ఫ్లాగ్ బలపడిందని తెలిపారు. పార్టీలో పనిచేసిన కామ్రేడ్ చిన్నబాబు, నాగేంద్ర, మట్టా అర్జున్, లింగంపల్లి వేణుమాధవ్ బాటలో పయనించాలని, సభ్యులకు వారి త్యాగాలను వివరించారు. మరీదు ప్రసాద్ బాబు, లింగంపల్లి సత్య వర్ధన్, వేమూరి భాస్కర్, ఎంబి చారి వ్యవహరించారు. నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీ కార్యదర్శిగా మరీదు ప్రసాద్ బాబు, ఎన్నుకోబడ్డారు. మరో 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పడింది. తెలంగాణ కార్యదర్శిగా లింగంపల్లి సత్య వర్ధన్  ఎన్నుకోబడ్డారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. సభ ప్రారంభోత్సవానికి ముందు అమరవీరుల స్థూపాన్ని మరీదు ప్రసాద్ బాబు ఆవిష్కరించారు. డోలక్ యాదగిరి అమరవీరుల పాటలతో మహాసభల ప్రాంగణం మారుమ్రోగింది. రెండు రాష్ట్రాల నుంచి 50 మంది ప్రతినిధులు సభలో పాల్గొని గత కార్యక్రమాలను సమీక్ష చేశారు.

About Author