అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మునిసిపల్ హాల్ లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించబడినది. ఇందులో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ. భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్ , అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
1. తుంగభద్రా కాలనీ కి చెందిన శ్రీ రవికాంత్ఇతరులు, తమ కాలనీ యందు త్రాగు నీటి సరఫరా మరియు మురుగు నీటి వ్యవస్థ సరిగా లేదని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్యకి ఒక పరిష్కారము చూపవలసినదిగా కమీషనర్ని కోరారు.
2. కరీం నగర్ కి చెందిన శ్రీ రమేష్, ఇతరులు, తమ కాలనీ యందు సరియైన మురుగు నీటి వ్యవస్థ లేదని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్యకి ఒక పరిష్కారము చూపవలసినదిగా కమీషనర్ని కోరారు
3. రోజా వీధి కి చెందిన శ్రీమతి ఆయేషా , తమకు గతం లో టిడ్కో ఇల్లు మంజూరు అయినదని, ప్రభుత్వ నిర్ణీత రుసుము కూడా కట్టి ఉన్నామని, కాని ప్రస్తుత పరిస్థితి వలన తాము మిగులు రుసుము కట్టలేమని, కావున కేటాయించిన గృహము రద్దు చేసి, తాము కట్టిన రుసుము తమకు తిరిగి ఇవాలని కమీషనర్ని కోరారు.
4. పాత కర్నూలు కి చెందిన శ్రీమతి సఫూర ఖాతూన్ , తమకు గతం లో టిడ్కో ఇల్లు మంజూరు అయినదని, ప్రభుత్వ నిర్ణీత రుసుము కూడా కట్టి ఉన్నామని, కాని ప్రస్తుత పరిస్థితి వలన తాము మిగులు రుసుము కట్టలేమని, కావున కేటాయించిన గృహము రద్దు చేసి, తాము కట్టిన రుసుము తమకు తిరిగి ఇవాలని కమీషనర్ని కోరారు.
5. జుడిషియల్ కాలనీ కి చెందిన శ్రీ ఆచారి ,ఇతరులు తమ వీధి యందు మురుగు నీటి వ్యవస్థ మరియు రోడ్డ్లు లేకపోవటం వలన తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నామని, కావున ఈ సమస్యను వీలైనత త్వరగా ఒక పరిష్కారము చూపవలసినదిగా కమీషనర్ని కోరారు.
6. రాందాస్ నగర్ కి చెందిన శ్రీ. బి.ఎస్.ఎస్ రెడ్డి ,ఇతరులు తమ వీధిన కొత్త సి.సి. రోడ్డు కేటాయించి, రోడ్డు వేయవలసినదిగా కమీషనర్ని కోరారు.
7. విజయలక్ష్మి నగర్ కి చెందిన శ్రీమతి రత్నమ్మ గారు , తమకు గతం లో టిడ్కో ఇల్లు మంజూరు అయినదని, ప్రభుత్వ నిర్ణీత రుసుము కూడా కట్టి ఉన్నామని, కాని ప్రస్తుత పరిస్థితి వలన తాము మిగులు రుసుము కట్టలేమని, కావున కేటాయించిన గృహము రద్దు చేసి, తాము కట్టిన రుసుము తమకు తిరిగి ఇవాలని కమీషనర్ గారిని కోరారు.
ఈ రోజు సోమవారం స్పందన కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ. భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్ గారు, ఎస్.ఈ. శ్రీ. వేణుగోపాల్ గారు, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీ మోహన్ కుమార్ గారు, ఎంహెచ్వో శ్రీ విస్వేస్వర్ రెడ్డి గారు, మేనేజర్ శ్రీ చిన్న రాముడు గారు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.