స్పందన ఫిర్యాదులకు ప్రదాన్యత ఇవ్వండి….
1 min read– స్పందన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చట్ట పరిదిలో న్యాయం చెయ్యండి ……
– పోలీసు స్పందనకు 135 ఫిర్యాదులు..
– జిల్లా ఎస్పీ. శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 09-10-2023 ) నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS 135* ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ,స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ,స్పందన పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని ఆదేశించారు.ఈ స్పందన ఫిర్యాదులలో ఎక్కువగా సివిల్ తగాదాలు,కుటుంబ కలహాలు,అన్నదమ్ముల ఆస్థి పంపకాలలో మనస్పర్దలు మొదలగునవి ఉన్నాయి.
ఫిర్యాదులలో కొన్ని ……..
1) నేను కోవెలకుంట్ల లోని GCR కాంప్లెక్స్ నందు గల ATM లో డబ్బులు తీసుకొనుచుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను మాటల్లో పెట్టి నా వద్ద ఉన్న ATM కార్డును మార్చి వేరే ATM కార్డును నాకు ఇచ్చి నా ATM కార్డుతో ఆగష్టు 26 మరియు 27 తారికులలో 68,500/- రూపాయలను తీసుకున్నారని నాకు న్యాయం చెయ్యండి అని బిజినవేములకు చెందిన శ్రీనివాస కాలేజీ లెక్షరర్ G.మాబు హుసేన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
2). నా రెండవ కుమారుడైన G.ఖాజా హుస్సేన్ అతని భార్యా కరిమూన్ నన్ను నాభర్తను ఇల్లు వ్రాసివ్వాలని ధూసించూచు, కొట్టుచున్నారని చంపుతామని బెదిరిస్తున్నారని నాకు న్యాయం చెయ్యండని బనగానపల్లికి చెందిన G.నజీమూన్నీసా జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు.
3). ఫ్లాట్ల వ్యాపారం చేసుకుందాం అని అందు కొరకు 30 లక్షలు అవసరం అవుతాయని వాటిని తెస్తే అందరం కలిసి వ్యాపారం చేసుకోవచ్చు అని శిల్పనగర్ కు చెందిన శ్రీవల్లి మనోజ్ లు కలిసి నా వద్ద నుండి 30 లక్షలు తీసుకొని నాకు తెలియకుండా ఇళ్ల స్థలాలు కొని వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొన్నారని ఎందుకు ఇలాగ చేశావు అని నా డబ్బులు నాకివ్వమని అడుగగా ఇవ్వను ఏవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని మళ్ళీ డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని నాకు న్యాయం చేయండి అని పొన్నాపురం కు చెందిన M.వరదరాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
4).బండిఅత్మకూరు మండలం పరమటూరు గ్రామానికు చెందిన చిన్న స్వామి అనే రైతు పొలం సాగు చేసుకుంటుండగా సదరు భూమి పై తమకు హక్కు ఉంది అంటు కొందరు వ్యక్తులు పంటను ట్రాక్టర్ తో ధ్వంసం చేసినారని నాకు న్యాయం చేయండి అని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.నంద్యాల జిల్లా ఎస్పీ స్పందకు వచ్చిన ఫిర్యాదిదారులకు ఓంకారం ధేవస్థానం వారిచే భోజన వసతి ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ G.వెంకటరాముడు స్పెషల్ బ్రాంచ్ DSP జె.వి సంతోష్ పాల్గొన్నారు.