ఎస్టీ విద్యార్థులకు నోట్ బుక్ పెన్నులు వితరణ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని కైలాసగిరి కోన లో ఎస్టి డ్రాప్ అవుట్ విద్యార్థుల కొరకు నూతనంగా ప్రారంభించిన ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కు వైఎస్ఆర్సిపి నాయకురాలు దాదిరెడ్డి భాగ్యమ్మ, సోమవారం, నోట్ బుక్స్, పెన్నులు, పలకలు, పెన్సిల్లు , రబ్బర్లను వితరణ చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్టి విద్యార్థులు మంచి ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవ మర్యాదలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు, విద్యార్థుల కొరకు తమ వద్దు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు, ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా వారి తల్లిదండ్రులతో పనులకు వెళ్లే వారని ఈ విషయాన్ని అటు మండల విద్యాశాఖ అధికారులతో, ఇటు ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు, వారు వెంటనే స్పందించి ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, విద్యార్థులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలతో మరింత ముందుకెళ్లి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా చూడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు, ఇక్కడి విద్యార్థులనే కాకుండా బలిసింగాయ పల్లె గ్రామపంచాయతీలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తమ వంతు సహాయం చేయడానికి ఎప్పుడు వెనుకాడనని ఆమె తెలిపారు, ముఖ్యంగా మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉంటే దగ్గరుండి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం వారికి చూపించడం, మెరుగైన చికిత్స కొరకు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో వారిని ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించడం జరుగుతుందన్నారు, తమ వంతు పార్టీకి ఏదో రకంగా కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు, అలాగే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్లయితే వారికి ప్రోత్సాహంగా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజారావు, గ్రామ సచివాలయ సిబ్బంది బాలకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.