PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దసరా సెలవుల్లో టీచర్ల శిక్షణ వాయిదా వేయాలి..ఆపస్              

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  దసరా సెలవుల్లో టీచర్ల శిక్షణ వాయిదా వేయాలి..ఆపస్. సాల్ట్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు మూడు విడతలలో  ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం అన్ని జిల్లాల్లో నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి విడతగా  ఈనెల 9 నుంచి 14 వరకు , రెండో విడతగా 16 నుంచి 21 వరకు, మూడో విడతగా 26 నుండి 31 వరకు నిర్వహించాలని షెడ్యూలు ఇవ్వడం జరిగింది. అయితే రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని దసరా సెలవుల్లో నిర్వహించాల్సి ఉందని, ఉపాధ్యాయులందరూ దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు గాను వారి సొంత గ్రామాలకు వెళ్లడం అందరికీ తెలిసిందేనని అందుకే దసరా సెలవుల్లో నిర్వహించాల్సిన రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ లు డిమాండ్ చేశారు. ఈ విషయమై విద్యాశాఖ కమిషనర్ గారికి వినతి పత్రం మెయిల్ ద్వారా పంపి కోరడం జరిగిందని, కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి వాయిదా వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్నారు.సాల్ట్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు మూడు విడతలలో  ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం అన్ని జిల్లాల్లో నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి విడతగా  ఈనెల 9 నుంచి 14 వరకు , రెండో విడతగా 16 నుంచి 21 వరకు, మూడో విడతగా 26 నుండి 31 వరకు నిర్వహించాలని షెడ్యూలు ఇవ్వడం జరిగింది. అయితే రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని దసరా సెలవుల్లో నిర్వహించాల్సి ఉందని, ఉపాధ్యాయులందరూ దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు గాను వారి సొంత గ్రామాలకు వెళ్లడం అందరికీ తెలిసిందేనని అందుకే దసరా సెలవుల్లో నిర్వహించాల్సిన రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ లు డిమాండ్ చేశారు. ఈ విషయమై విద్యాశాఖ కమిషనర్ గారికి వినతి పత్రం మెయిల్ ద్వారా పంపి కోరడం జరిగిందని, కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి వాయిదా వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్నారు.

About Author