బుజనూరు గ్రామంలో ఎస్ఐ పల్లెనిద్ర..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: బూజునూరు గ్రామంలో ఎస్సై బీ టీ వెంకట సుబ్బయ్య సోమవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించి గ్రామస్తులకు వివిధ అంశాల పైన అవగాహన కల్పించారు గ్రామాలలో దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసాంఘిక కార్యక్రమాలపై పోలీసుల నిఘా ఉందని జూదం,మట్కా , నాటు సారాయి తయారీ, అమ్మకం, వినియోగం మొదలగు వాటిపై ప్రత్యేక దృష్టి ఉంచి వారి పై పీడీ యాక్ట్ చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిభందనలను పాటించి రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని, మోటర్ సైకిల్ పై వెళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెంట్ పెట్టుకోవాలని ఆటోలో పరమితికి మించి ప్రయాణం చేయకూడదన్నారు సైబర్ క్రైమ్ ఫైన , లోన్ అప్ప్, అనవసర లింక్ ల పై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. గడివేముల మండల పరధి లో ఉన్న గ్రామాల ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్ లపై ప్రత్యేకంగా ఉంచినట్టు ఎవరు కూడా బెట్టింగుల జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు.గడివేముల మండల పరది లో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, చెడ నడత గలవారు ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన యెడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆదేశాలను, సూచనలను పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.