NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మాన్యశ్రీ కాన్సిరాం 17వ వర్ధంతి..

1 min read

విప్లవాత్మక రాజకీయ చైతన్యం నింపిన యోధుడు

బహుజన నాయకుడు మేతర అజయ్ బాబు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు   :  బలహీనవర్గాలకు ఆత్మస్థైర్యాన్ని నింపిన గొప్ప యోధుడు మాన్యశ్రీ కన్షిరామ్10 .10. 2023 ఏలూరు ఎస్సీ ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యాలయం నందు మాన్యశ్రీ కాన్సిరాం  17 వర్ధంతి కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో  బహుజన నాయకులు మేతర అజయ్ బాబు, సిరా భరత్  పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అజయ్ బాబు మాట్లాడుతూ భారత దేశ కోట్లాది ప్రజల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని నింపి సమ సమాజ స్థాపనకు కృషి చేసి, దేశ రాజకీయా లలో విప్లవాత్మక మైన రాజకీయ చైతన్యాన్ని నింపిన గొప్ప యోధుడు.  పూలే, అంబేద్కర్ భావజాలంతో వారి లక్ష్యాలను ప్రజల్లో తీసుకురావడానికి కృషి చేసిన నిబద్దతగల నాయకుడు. అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన గ్రంథం ద్వారా ప్రేరేపితుడై కులనిర్మూలిద్దాం, బహుజన సమాజాన్ని స్థాపిద్దాం అంటూ దేశవ్యాప్తంగా సైకిల్ పై యాత్ర చేసి బహుజన నాయకత్వం వహించిన ఆత్మగౌరవ రాజ్యాధికారం సాధించారు. సిరా భరత్ మాట్లాడు తూతన జీవితాన్ని దేశం కోసం, ఉన్నత ఉద్యోగాన్ని వదిలి కుటుంబాన్ని వదిలి, ఈ దేశ ప్రజల పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చేసిన గొప్ప త్యాగమూర్తి , ఆయన ఆశయ సాధనకు మనందరం కృషి  చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి రత్నబాబు, కందుల దేవరాజ్, గురవయ్య, రాజు, సొంగ రాంబాబు, షేక్ అమీరా, మందపల్లి సునంద కుమారి, తేట్ల కృష్ణారావు, వెంకట్, తోటకూర రవి, మోషే ,సామిల్ తదితరులు పాల్గొన్నారు.

About Author