అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు..
1 min read– 12 వందలమంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు ప్రసాద వితరణ..
– వివిధ సేవల రూపేణ రూ: 1,04,100/- లు ఆదాయం..
– కార్యనిర్వాహణ అధికారి ఆకుల కొండలరావు వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మంగళవారం సందర్భముగా ఏలూరుజిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం విచ్చేసిన సుమారు 1200 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. శ్రీ స్వామి వారి దేవస్థానం నందు జరుగు నిత్య అన్నదనమునకు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు మల్లాది సీతారామారావు (MSR ) వారు రూ.50,000/-లు ఆలయ కార్యనిర్వహణాధికారి కి వారి చేతుల మీదుగా శ్రీ స్వామి వారికి అందజేశారు. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.1-00 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రిపేణా రూ.1,04,100/-లు ఆదాయము వచ్చినది. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములూ కలుగకుండా ఆలయ పర్యవేక్షకులు కృష్ణ మరియు కె.రంగారావు వార్ల పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.