PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిటిడి.. ఆదాయాన్ని ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడరాదు

1 min read

– విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి..

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ వరసిద్ధి వినాయక మందిరం,వినాయక ఘాట్, కర్నూలు నందు జరిగిన ” విశ్వ హిందూ పరిషత్ విలేఖరుల సమావేశం ” లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో…  “టీటీడీ యొక్క బడ్జెట్లో సంవత్సరంలో ఒక శాతం నిధులను తిరుపతి నగర అభివృద్ధికి కేటాయించాలన్న” నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందని,  ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని టీటీడీ బోర్డుని విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది.ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోయిన పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేస్తామని,హిందువుల ధర్మ ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని హెచ్చరించారుఇంకా మాట్లాడుతూ..   ఇప్పటికే టిటీడి నిధులను భక్తుల సౌకర్యాల పేరుతో తిరుపతి అభివృద్ధికి  కేటాయిస్తున్నారు. ఇప్పుడు పర్సంటేజ్ పేరుతో శాశ్వతంగా నిధులను కాజేసే ఈ దుర్మార్గపు పరిస్థితిని వ్యతిరేకిస్తున్నామన్నారు…విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ.   తిరుమల – తిరుపతి దేవస్థానం పాలక వర్గం ఇలా నిధులివ్వడం మొదలుపెడితే ఈ నిధులను బదలాయించే ప్రక్రియలో ఇక పర్సంటేజ్ ను పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో నుంచి మున్సిపాలిటీకి నిధులను కబ్జా చేయటం కోసం టిటిడి హుండీలో చెయ్యి పెట్టినట్లుగానే భావిస్తున్నామన్నారు   అలాగే ఈ నిర్ణయంపు ప్రేరణతో మిగిలిన దేవాలయాల్లో కూడా ఈ పద్ధతిలోనే పర్సంటేజ్ ప్రకారంగా నిధులను కొల్లగొట్టే కుట్రగా విశ్వ హిందూ పరిషత్  భావిస్తుందనీ ఎట్టిపరిస్థితుల్లో నూ ఈ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని,వెంఠనే ఈ నిర్ణయాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు…విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి యస్.ప్రాణేష్ మాట్లాడుతూ…  హిందూ ధర్మం సంరక్షణ  కోసం, హిందూ ధర్మం ప్రచారం కోసం ఖర్చు పెట్టవలసిన తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను భక్తుల మౌలిక వసతుల ఏర్పాటు పేరుతో తిరుపతిలో ఎలా ఖర్చు పెడతారు? తిరుపతిలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు నివాసం ఉంటున్నారు. అలాగే తిరుపతి నగరంలో వున్న అనేక టిటిడి ఆస్తుల నుంచి, అనేక పద్ధతుల్లో ఇప్పటికే ప్రభుత్వం  నిధులను పొందుతూనే ఉంది. కాబట్టి తిరుపతి నగర యొక్క అభివృద్ధిని తిరుపతి నగరపాలక సంస్థే చేయవలసి ఉంది.మరోపక్క మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా హిందూ దేవాలయాల అభివృద్ధికి ప్రత్యక్షంగా సహాయం చేస్తున్న ఈ నేపథ్యంలో టీటీడీ కానుకలను అక్రమంగా, హక్కుగా కాజేయాలని ఈ ప్రయత్నాన్ని ఆపివేయాలనీ ఎలాగైతే క్రైస్తవుల యొక్క చర్చిల అభివృద్ధికి, ముస్లింల యొక్క మసీదుల అభివృద్ధికి ప్రభుత్వ నిధుల నుండి నిధులను కేటాయిస్తున్నారో అలాగే తిరుపతి నగర అభివృద్ధికి,  సౌకర్యాలకు ప్రభుత్వమే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వం మీదనే ఉన్నది. కావున 1% (ఒక్క శాతం) నిధుల నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానపు ధర్మకర్తల మండలి పునరాలోచన చేసి నిర్ద్వందంగా రద్దు చేయాలనీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాము ఈ విషయంలో 2 రోజుల్లో తిరుమల – తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని లేకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వి.ప్రసాద్,రాష్ట్ర కోషాధికారి సందడి మహేష్,జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,జిల్లా కోశాధికారి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author