PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫార్మర్ ఈ-కెవైసి రేపటికి వంద శాతం పూర్తి కావాలి

1 min read

మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఎ‌‌ వెళ్లకుండా పరిష్కరించాలి

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫార్మర్ ఈ-కెవైసి రేపటికి వంద శాతం పూర్తి చేయడంతో పాటు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఎ‌‌ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మండల స్థాయి అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలు నందు రెవెన్యూ తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి ఫార్మర్ ఈ-కెవైసి పెండింగ్ ఉన్న గ్రామాలను విఆర్ఓలతో ఫార్మర్ అథెంటికేషన్ రేపు మధ్యాహ్నం నాటికి పూర్తి చేయాలన్నారు. అదే విధంగా శనగ విత్తనాలను సబ్సిడీతో రైతులకు అందిస్తునన్నందున అవసరమున్న రైతులు తమ ఆధార్ కార్డుతో రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకొని నగదు చేయించినట్లుయితే ఏపి సీడ్స్ ద్వారా సదరు విత్తనాలు రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేయడం జరుగుతుందని, సదరు విత్తనాలను రైతు మొబైల్ ఫోన్ కు వచ్చే ఓటిపి ద్వారా వారికి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అబాడి సర్వేకు సంబంధించి పెండింగ్ ఉన్న గ్రామాలు త్వరితగతిన గ్రౌండ్ ట్రుథింగ్ పూర్తి చేయడంతో పాటు గ్రౌండ్ వ్యాలిడేషన్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రీసర్వే కు సంబంధించి ఇంకా 5707 సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, అందులో సి.బెలగల్, ఉయ్యాలవాడ మండలాలు కాస్త వెనుకంజలో ఉన్నాయని సదరు గ్రామాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఫేజ్-3లో పెండింగ్ ఉన్న మండలాల గ్రౌండ్ ట్రుథింగ్ తో ఎల్పిఎం జనరేషన్ కూడా పూర్తి చేయాలన్నారు.జగన్నకు చెబుదాంకు సంబంధించి మండల/డివిజన్ స్థాయిలో అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, అన్ని మండల తహశీల్దార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా పరిష్కరించిన అర్జీలకు సంబంధించి అర్జీదారులకు అక్నాలెడ్జ్మెంట్ అందజేయాలన్నారు.మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయాలలో సరైన మౌలిక సదుపాయాలు లేని వివరాలను సేకరించి పంపించాలని ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.జగనన్నకు చెబుదాం, ప్రజాప్రతినిధులు ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పత్రికల్లో వచ్చే ప్రతికూల అంశాలకు సంబంధించి రిజాయిండర్/యాక్షన్ టేకెన్ రిపోర్ట్ త్వరితగతిన అందజేయాలని అన్ని మండల తహశీల్దార్లను ఆదేశించారు.ఆదోని, కర్నూలు నందు జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఏర్పాటుకు గాను 15 సెంట్ల అనువైన స్థలాన్ని గుర్తించాలన్నారు. అదే విధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కర్నూలు ఆర్డీఓ ను ఆదేశించారు.అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ మండల స్థాయిలో తహశీల్దార్లు ప్రతి మంగళవారం సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని స్పందన, తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించుకొని సదరు సమావేశాల మినిట్స్ ను జిల్లా కేంద్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, అన్ని మండల తహశీల్దార్లను ఆదేశించారు.సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు, కెఆర్సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగప్రసన్న లక్ష్మి, డిపిఓ నాగరాజు నాయుడు, సర్వే ఏడి మణికన్నన్, విజయ సారథి, డిఎల్పిఓ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author