PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ నెల 14..15 వ తేది లలో (ఎస్​ఐ)  మెయిన్స్  ఫైనల్ రాత పరీక్షలు…

1 min read

కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ , జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ .

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రెండు రోజుల పాటు (అక్టోబర్ 14(శనివారం), అక్టోబర్ 15 (ఆదివారం) తేదిలలో  కర్నూలు పట్టణ కేంద్రంలోని  14 పరీక్ష కేంద్రాలలో ఎస్ ఐ మెయిన్స్ ఫైనల్ రాత పరీక్షలు జరగనున్నాయని కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  తెలిపారు. ఈ సంధర్బంగా  గురువారం  కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో  ఒక సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే పరీక్షలలో నాలుగు పేపర్లు (2 పేపర్లు డిస్క్రిప్టివ్ టైప్ మరియు 2 పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్) ఉంటాయి. అక్టోబర్ 14 వ తేది  ఉదయం 10  నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (పేపర్-I) &  మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు  (పేపర్ II) ఉంటుంది.అక్టోబర్ 15 వ తేది ఉదయం 10  నుండి మధ్యాహ్నం 1  గంట వరకు  (పేపర్-III)  & మధ్యాహ్నం  2.30 PM నుండి సాయంత్రం 5.30 వరకు  (పేపర్-IV) పరీక్ష జరగనుంది.

ఎస్సై మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్దుల  పరీక్ష కేంద్రాలు … 14.

1)        CENTER – A  సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల – సుంకేసుల రోడ్, – కర్నూలు .

2)        CENTER –  B  సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల – సుంకేసుల రోడ్, – కర్నూలు.

3)        సిస్టర్ స్టానిస్లాస్ మెమోరియల్ ఇంగ్లీష్ స్కూల్ – సుంకేసుల రోడ్ – కర్నూలు.

4)        మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ –  (A – క్యాంప్) ,  కర్నూలు,

5)        కె.వి.ఆర్. ప్రభుత్వ కాలేజ్ ఫర్ ఉమెన్ –  రైల్వే స్టేషన్ రోడ్,  కర్నూలు,

6)        ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్), కోట్ల సర్కిల్ –  కర్నూలు   

7)        బృందావన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ పెద్ద టేకూరు కర్నూలు

8)        అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల – దూపాడు – కర్నూలు. 9)        డా. కెవి సుబ్బారెడ్డి  ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దూపాడు – కర్నూలు.

10)      రాయలసీమ యూనివర్సీటి కళాశాల ఆఫ్ ఇంజనీరింగ్ – నంద్యాల రోడ్ – కర్నూలు.

11)      CENTER – A జి. పుల్లారెడ్డి  ఇంజనీరింగ్ కాలేజ్  – నంద్యాల రోడ్ కర్నూలు. 12)      CENTER – B   జి. పుల్లారెడ్డి  ఇంజనీరింగ్ కాలేజ్  – నంద్యాల రోడ్ కర్నూలు.

13)      జి. పుల్లయ్య  కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ నందికొట్కూర్ రోడ్ కర్నూలు.

14)      రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ – నందికోట్కూరు రోడ్ – కర్నూలు

ఈ పై 14  పరీక్ష కేంద్రాలలో   8,521 మంది అభ్యర్ధులు ఎస్సై మెయిన్స్ పరీక్ష కు హజరువుతున్నారని తెలిపాదళారుల మోసపూరిత మాటలు , ఉద్యోగాలు ఇప్పిస్తామని గాని చెప్పే వారి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని ఎస్సై మెయిన్స్ ఫైనల్ రాత పరీక్ష రాసే అభ్యర్ధులకు  కర్నూలు రేంజ్ డిఐజి  , జిల్లా ఎస్పీ  తెలిపారు.  పోలీసు నియామక ప్రక్రియ రాత పరీక్షలు  డిఎస్పీ స్దాయి అధికారుల పర్యవేక్షణలో   పారదర్శకంగా , నిష్పక్షపాతంగా  జరుగుతాయన్నారు.పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  వదంతులు, పుకార్లు నమ్మవద్దన్నారు. పరీక్ష హాజరయ్యే అభ్యర్దులు హాల్ టికెట్ , ఆధార్ వంటి గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్ లు తీసుకురాకుడదన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్దులు ముందురోజే ఎగ్జామ్ సెంటర్ల ప్రాంతాలకు చేరుకోవాలన్నారు.పరీక్షకు హజరయ్యే అభ్యర్దులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవాలన్నారు. ఏవరైనా పరీక్ష కేంద్రాలలో మాల్ ప్రాక్టిస్ వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్దులు తమ సెంటర్ల ను తెలుసుకునే విధంగా APSRTC బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి,  అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా  దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని   అభ్యర్దులకు  తెలిపారు. దళారుల గురించి తెలిస్తే డయల్ 100 కు గాని, దగ్గర్లోని పోలీసుస్టేషన్ లో గాని సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్ . సెంథిల్ కుమార్ ఐపియస , జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్   తెలిపారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపియస్ , కర్నూలు జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అడిషనల్  రీజినల్ కో ఆర్డినేటర్  ఫ్రోఫెసర్ సతీష్ కుమార్, ఫ్రోఫెసర్ జోహుర్ , బయోమెట్రిక్, ఫింగర్ ఫ్రింట్ సిబ్బంది పాల్గొన్నారు.  

About Author