బైపాస్ రోడ్డు కట్టింగ్ లో నష్టపరిహారం ఇచ్చి ..పనులు చేప్పటాలి
1 min readడోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండలం, బురుగుల గ్రామంలో బైపాస్ రోడ్డు కట్టింగ్ లో కోల్పోయే వారికి నష్టపరిహారం ఇచ్చిన తరువాత నే పనులు మొదలు పెట్టాలని డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి అన్నారు.ఈ సందర్బంగా గురువారం డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి , రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వై.నాగేశ్వరావు యాదవ్ , మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర టిడిపి నాయకులతో కలసి బురుగుల గ్రామంలో రోడ్డు కట్టింగ్ అయ్యే ప్రాంతాన్ని సందర్శించి గ్రామంలో రోడ్డు పై బైటాయించి నిరసన చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ… బైపాస్ రోడ్డు రాచర్ల గ్రామం నుండి బురుగుల గ్రామం మీదుగా వేస్తున్నా బైపాస్ రోడ్డు ప్రజలకు ఇబ్బంది కాకుండా బైపాస్ రోడ్డు గ్రామం బయట వెళ్ళె విధంగా వేయాలని అన్నారు. తప్పని సరిగా బురుగుల గ్రామం ఉరిలోనుండే వెయవలసి వస్తే 74 ఇళ్ళు కోల్పోతారని , ఆ 74 కుటుంబాలు రోడ్డున పడకుండా తప్పని సరిగా వారికి నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే పనులు మొదలు పెట్టాలని తెలుగుదేశంపార్టీ తరుపున మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ బైపాస్ రోడ్డు కేవలం కాంట్రాక్టర్లకు ,బెన్ఫీషర్ల ఆదాయాల కోసమే తప్పా ప్రజల కొరకు కాదనీ , అవసరమైన చోట వేయకుండా అనవసరమైన చోట వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధికార ప్రతినిధి రాంమోహన్ యాదవ్, ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య, ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి మెట్టుపల్లె సుదర్శన్, క్రిష్ణయ్య, డోన్ నియోజకవర్గ టిడిపి తెలుగుయువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్,రమేశ్వరెడ్డి,కౌలుపల్లె శివారెడ్డి, మండలం తెలుగుయువత అధ్యక్షులు కోదండరామయ్య, నియోజకవర్గ టిడిపి ఐటిడిపి ఉపాధ్యక్షులు సురేంద్ర చౌదరి, శ్రీరాములు,లాల్ రెడ్డి,క్రిష్ణారెడ్డి, శ్రీరాములు, కాంతారావు, ఐటిడిపి వినయ్ చౌదరి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వేంకటేష్ చౌదరి,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.