ప్యాపిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
1 min read: బిజెపి మండల అధ్యక్షులు కే . బి. దామోదర్ నాయుడు.
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : జిల్లా లోనే అతిపెద్ద మండలం గా ప్యాపిలి ఉన్నప్పటికి మండలం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ముఖ్యంగా ఇక్కడ బ్రతుకు తెరువు కూడా ప్రజలకు కష్టంగా మరే అవకాశం ఉందని,మండలం లో దాదాపు 80 శాతం మంది వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారని,ఖరీఫ్ పంటకాలంలో వర్షాలు సకాలంలో కురవక పంట నష్టం ప్రతి ఏట ఏర్పడుతుందని, అందుకే ప్యాపిలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని బిజెపి మండల అధ్యక్షులు కే. బి.దామోదర్ నాయుడు మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి కే. సి. మద్దిలేటి,జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే మహారాజ్, దాసరి నాగరాజు లు డిమాండ్ చేశారు.గురువారం తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు.అనంతరం మండల అధ్యక్షులు మాట్లాడుతు మండలంలోని కలచట్ల,చిన్నపుజల, పెద్ద పూజల, మెట్టుపల్లి, రంగాపురం, చంద్రపల్లి,భావిపల్లి, కొమ్మమరి,పెద్ద పాయి, పీర్ పల్లి తదితర గ్రామాలు వేరుశనగ, కంది, పత్తి,పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడ రావడం లేదని వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగించే రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.వెంటనే ప్యాపిలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి పంట నష్టానికి ఎకరాకు రూ.25 వేలు ఇచ్చి రైతులని ఆదుకోవాలన్నారు.