చిరుధాన్యాల ఉత్పత్తుల తో మహిళలు స్వయం ఆర్థిక సమృద్ధి
1 min readపల్లె వెలుగు వెబ్ పత్తికొండ: చిరుధాన్యాలతో తయారుచేసిన ఉత్పత్తుల ద్వారా మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించవచ్చని నాబార్డు D.D.M.ఎం. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.గురువారం స్థానిక స్త్రీ శక్తి భవన్లో MEDP ప్రోగ్రాంలో భాగంగా మిల్లెట్స్ పై మహిళలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా NABARD DDM M. సుబ్బారెడ్డి గారు,KVK బనవాసి వ్యవసాయ క్షేత్రం ప్రొఫెసర్ సుజాత, సైంటిస్టు అపర్ణ, నవయూత్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి,డైరక్టర్ U. నరసింహులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. MEDP శిక్షణా కార్యక్రమం లో చిరుధాన్యాల సాగు పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. అలాగే పండించిన చిరుధాన్యాల తో తాయారు చేసే స్వీట్స్, బిస్కట్లు మొదలగు పదార్థాల గురించి మహిళలకు వివరించారు.మిల్లెట్స్ తో ప్రొడక్ట్స్ తయారు చేయడమే కాక వాటిని మహిళలే మార్కెట్ చేసే అవకాశం నాబార్డు కల్పిస్తుందన్నారు.నలకడొద్ది మరియు అగ్రహారం గ్రామాల పొదుపు మహిళలు 30 మందికి ట్రైనింగ్ 15 రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిక్షణ ద్వారా వారి నైపుణ్యం తో చిరుధాన్యాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొని చేసుకొని అధిక ఆదాయం గడించాలని నవయుత్ అసోసియేషన్ సంస్థ డైరెక్టర్ నరసింహులు తెలియజేశారు మహిళలకు శిక్షణ తర్వాత చిరుధాన్యాలు ఉత్పత్తులను మహిళలు స్వయంగా ఇంటిలో తయారు చేసి వారే మార్కెట్ చేసుకునేందుకు నాబార్డ్ ఆర్థిక తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ డి పి. సీఈవో కేసీ మునిస్వామి, లక్ష్మన్న, పొదుపు మహిళలు పాల్గొన్నారు.