PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్​  పార్టీ నాయకులను కలిసిన మాల మహానాడు నాయకుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ కైకలూరు : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలానికి చెందిన రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షుడు డా|| సేవా నాగా జగన్ బాబురావు,రాష్ట్ర మాదిగ దండోరా ఉపాధ్యక్షులు ఏసుపొగు దానియేలు, గురువారం విజయవాడ వైయస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన పిలుపుమేరకు  కార్యాలయానికి వెళ్లి కలిసి వచ్చినామని బాబురావుఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగాఆ కార్యాలయంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి  వైయస్సార్ పార్టీ ఎమ్మెల్సీ మరియు చీఫ్ విఫ్ లేళ్ళ అప్పి రెడ్డి ని రాష్ట్ర అధికార ప్రతినిధి అంకంరెడ్డి నారాయణమూర్తి , మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులను కలిసి కైకలూరు నియోజకవర్గంలో దూలం.నాగేశ్వరరావు ఆయన కుమారులు మా మీద కైకలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు విషయమై వాళ్లకి తెలియజేయడం జరిగిందని, ఆ విషయంపై  గౌరవ సలహాదారులు రామకృష్ణారెడ్డి, ఎం ఎల్ సి, చీఫ్ విప్ అప్పి రెడ్డి నారాయణమూర్తి, మాట్లాడుతూ మాకు హామీ ఇచ్చి మీకు జరిగినటువంటి అన్యాయంపై మేము ఎంక్వయిరీ చేసి కైకలూరు నియోజకవర్గం లో ఉన్నటువంటి వైయస్సార్ పార్టీ అభిమానులందరికి తగు న్యాయం జరిగే విధంగా చూస్తామని అన్నారు. బాబురావు మాట్లాడుతూమీరు పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి మన వైయస్సార్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని సూచించారని  అన్నారు. దానియేలు మాట్లాడుతూ దూలం నాగేశ్వరరావు ఆయన కుమారులు అక్రమ సంపాదన సంపాదించుకుంటూ మాల మాదిగల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు  తగు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని దానియేలు అన్నారు.రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు నల్లగంటి వెంకట పద్మావతి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం లో జగన్  ముఖం చూసి నీకు ఓట్లు వేస్తే నీవు ఎమ్మెల్యే అయ్యి కైకలూరు నియోజకవర్గం ఎస్సీ, బీసీ, మైనారిటీల, మీద తప్పుడు కేసులు పెట్టించిన దూలం నాగేశ్వరావుకి తగిన బుద్ధి చెబుతామని, పద్మావతి అన్నారు. ఈకార్యక్రమంలో  ,రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారని బాబురావుఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author