ఏటీఏం చార్జీలు పెరిగాయ్ !
1 min readపల్లెవెలుగు వెబ్: ఏటీఏం లావాదేవీల పై చార్జీలు వచ్చే ఏడాది జనవరి నుంచి పెరగనున్నాయి. నెలలో ఉచితంగా చేసే లావాదేవీలు మినహాయిస్తే.. మిగిలిన లావాదేవీలకు చార్జీలు పెంచేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి ఏటీఎం లావాదేవీల మీద 21 రూపాయలు చార్జీ వసూలు చేయనున్నారు. ఏటీఏం కేంద్రాలు నెలకొల్పేందుకు నిర్వహణ వ్యయం పెరగడం, ఇంటర్ చేంజ్ ఫీజు పెరగడం, సాధారణ ఖర్చులకు గాను వినియోగదారుల చార్జీలు పెంచేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల ఏటీఏం నుంచి ప్రతి నెల 5 ఉచిత లావాదేవీలు యథాతథంగా కొనసాగనున్నాయి.