మంత్రి ని కలిసిన ఏపీఎన్జీవో స్ సంఘ నాయకులు..
1 min read– ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి
– సానుకూలంగా స్పందించిన మంత్రి బొత్స
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : విజయవాడలో మంత్రి వర్గ ఉప సంఘం లో ముఖ్య ప్రతినిధి బొత్స సత్యనారాయణని వారి క్యాంప్ కార్యాలయంలో కల్సిన రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె వి శివారెడ్డి. జిల్లా అధ్యక్షులు కొటారుఈశ్వర్ రావు,చోడగిరి శ్రీనివాస్, బి. చంద్రశేఖర రెడ్డి, జర్రిపోతుల మురళి తదితరులు. మంత్రి దృష్టికి ఉద్యోగుల సరెండర్ లీవ్స్, జీ పీ ఎఫ్ ,ఏపీ జి ఎల్ ఐ లు,పోలీసులు కి సరెండర్ లీవ్స్ త్వరితగతిన ఇవ్వాలని, అదే విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల GO. మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు కు 35 రోజుల క్యాజువల్ లీవ్స్ తో పాటు 5 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్స్ GO ఇంకా రాలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చి వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్జీవోస్ నాయకులు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత ఫైనాన్స్ అధికారులు, GAD అధికారులతో మాట్లాడి వెంటనే GO లు ఇవ్వాలని. జీతాలు పడిన తర్వాత సరెండర్ లీవ్స్ ని దశల వారిగా ఇస్తామని మంత్రి ఎన్జీవో సంఘ నాయకులు కు హామీ ఇచ్చారని తెలిపారు.