జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు వరం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరంగా మారిందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. జూపాడుబంగ్లా మండలం, జూపాదు బంగ్లా -2 సచివాలయం పరిధిలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి, విచారించి, ప్రజనుద్దేశించి మన జగనన్న పేదల సంక్షేమం కోసం, మరింత మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో మీ దగ్గరికే వైద్యులు వచ్చి సేవలు అందిస్తున్నారని, ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోతే బాలయ్య ,మండల తహసిల్దార్ పుల్లయ్య యాదవ్ , ఇంచార్జ్ ఎంపీడీవో నూర్జహాన్ ,ఎంపీటీసీ కృపాకర్ మండల నాయకులు జంగాల పెద్దన్న , జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చంటిగారి దిలీప్ రాజ్ , వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పైపాలెం ఇనయతుల్లా , పోతులపాడు శివానంద రెడ్డి, పారుమంచాలు దేవ సహాయం, తాటిపాడు కృష్ణారెడ్డి, మహేష్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.