NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ రాజ‌కీయ‌ అరంగేట్రం పై బాల‌య్య హాట్ కామెంట్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయ అరంగేట్రం పై బాల‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవ‌రి ఆలోచ‌న‌లు వారివి. ఎవ‌రి ఇష్టాలు వారివి. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా ? . రారా? అన్న విష‌యం గురించి పెద్దగా ఆలోచించ‌డంలేదు అని బాల‌య్య అన్నారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే టీడీపీకి ప్లస్ అవుతుందా? అన్న ప్రశ్నకు ఆయ‌న నవ్వి స‌మాధానం చెప్పకుండా ఉన్నారు. ఒక‌వేళ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. ప్లస్ అయి, మైనస్ అయితే అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. తెలుగుదేశం పార్టీ ఆవేశంలోంచి పుట్టింది. పార్టీ కార్యక‌ర్తలు ఎప్పుడూ పార‌ద‌ర్శకంగా ఉంటారు. అలాంటి వారికే పార్టీలో స‌ముచిత స్థానం ఉంటుంద‌ని చెప్పారు.

About Author