ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సెలవుల రోజున నడుపుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలైన శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఏఐ AISF ప్యాపిలి మండల సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం AISF నాయకులు నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి శివకేశవ మాట్లాడుతూ ప్యాపిలి పట్టణంలో ఉండే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు పాటించకుండా ఇష్ట రాజ్యాంగ విద్యాసంస్థలను నడుపుతున్నారని అదేవిధంగా ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా విద్యాసంస్థలు నడుపుతున్నారని విద్యార్థులకు సెలవులు అనేవి మానసిక ఆనందం కోసం ఇస్తున్నప్పటికీ ఈ ప్రవేట్ విద్యాసంస్థలు ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం చదువును తయారు చేసే మిషన్ గా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తూ సెలవు రోజుల్లో కూడా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారని వారు మండిపడ్డారు. కావున ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపే విద్యాసంస్థలపై గుర్తింపును రద్దుచేసి సీజ్ చేయాలని వారు కోరారు లేనిపక్షంలో అధిక ఆరుల ఆఫీసు లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి శివకేశవ, వంశీ, బంగారప్ప, శివ ప్రసాద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.