ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కౌన్సిల్ సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ ఒంగోలు: స్థానిక AKVK కళాశాల యందు జిల్లా అధ్యక్షులు కె. మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ D.A లను మంజూరు చేయాలని, PRC ఆలస్యమవుతున్న కారణంగా జులై 2023 నుండి IR ను ప్రకటించాలని కోరారు. ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు Ch. శ్రావణకుమార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం గత జాయింట్ staff కౌన్సిల్ లో హామీ ఇచ్చిన విధంగా సెప్టెంబర్ 30 లోగా అన్నీ రకాల నగదు చెల్లింపులు చేయాలని ఇంకా కొంతమందికి జీతాల చెల్లింపులు చేయాలని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర సహాధ్యక్షులు ఎం. చక్రపాణి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం తో పాటు విద్యార్థులలో దేశ భక్తి, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం పెంపోందించే విధంగాఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ch. హిమజ మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయుల భాగస్వామ్యం సంఘంలో పెంచాలని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ. లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ నేడు గురువుల పట్ల అక్కడక్కడా విద్యార్థులు అనుసరిస్తున్న తీరు చూస్తే సమాజంలో ఎటువంటి పరిస్థితులున్నాయో అర్ధం అవుతుందని విద్యార్థులకు నైతిక విలువల శిక్షణ ఎంతైనా అవసరం ఆణి అన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి టి. దిలీప్ చక్రవర్తి జిల్లా నివేదికను సమర్పించారు. APUS జిల్లా అనేక సమస్యల పట్ల ధర్నాలు, విజ్ఞాపన పత్రాలు, ప్రాతినిధ్యాలు చేయడం ద్వారా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందాని తెలిపారు.APUS ప్రకాశం జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గా కె. మల్లికార్జున రావు, టి. దిలీప్ చక్రవర్తి ఎన్నిక.2023-26 సంవత్సరాలకు గాను APUS జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కె. మల్లికార్జున రావు, టి. దిలీప్ చక్రవర్తి ఎన్నికయినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె. వెంకటేశ్వర్లు రెడ్డి తెలిపారు. AKVK కళాశాలలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో పై ఎన్నిక జరిగినదని ఇంకా జిల్లా కోశాధికారిగా BVS గుణప్రసాద్, ఉపాధ్యక్షులుగా కె. శంకరరావు, ఎస్. నాగప్రసాద్, VVSN మూర్తి, M. గీత, బి.కళ్యాణి, కార్యదర్శులు గా అర్. పెదరాయుడు,MNS ఆంజనేయులు,వి.రమణయ్య,కె. శ్రీనివాసులు,పి. ఎల్. న్. ప్రసూన, జే. రమాదేవి,కార్యవర్గ సభ్యులుగా పి.వి.నారాయణ, కె. జైహింద్ రెడ్డి,పి.లోక నాదo, టి. శేషారావు, కె.సుబ్రహ్మణ్యం, డి. అనురాధ, ఎం. సంధ్యారాణి, కార్యాలయ కార్యదర్శిగా కె. నరసింహం.ఒంగోలు డివిజన్ కార్యదర్శిగా వి. చంద్రశేఖర్, మార్కాపురం డివిజన్ కార్యదర్శిగా వి. శివకుమార్, కనిగిరి డివిజన్ కార్యదర్శి గా A.V. నారాయణ ను ఎన్నుకున్నట్లు తెలిపారు.