కొత్త గరిష్టాలకు స్టాక్ మార్కెట్.. లాభాల జోరు..!
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నష్టాలు ఉంటాయని చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే.. గతంలో 4.2 శాతం ద్రవ్యోల్బణం గరిష్టంగా నమోదయింది. కానీ ఇప్పుడు 4.7 శాతం అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదయింది. దీంతో మార్కెట్లో కరెక్షన్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ, ఇందుకు విరుద్దంగా అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బాటలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడ పయనిస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో 83 పాయింట్ల లాభంతో 15,820 వద్ద ట్రేడ్ అవుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 35,185 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే.. అమెరికా ద్రవ్యోల్బణం రేటు పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇంకా అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నట్టు మార్కెట్ కదలికను బట్టి అంచనా వేయవచ్చు.