PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

1 min read

– ఈవీఎంలు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి

– జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈవీఎంలు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు పక్కాగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.ఆదివారం స్థానిక కలెక్టరేట్ లోని ఈ.వి.యమ్ గోడౌన్ ను జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ జి. సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ తో కలిసి పరిశీలించారు.జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 16వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 16 మంది బెల్ల్ కంపెనీ ఇంజనీర్లు పాల్గొంటారు అన్నారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకోసం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఎలాంటి చిన్న పొరపాట్లు జరగడానికి వీలు లేదన్నారు. అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి సోమవారం నుంచి ఫస్ట్ లెవెల్ చెకింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ ను ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలను మాత్రమే అనుమతించాలన్నారు.ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో పాటించాల్సిన నియమ నిబంధనలు, సూచనలు తెలియజేశారు. ఎవరూ కూడా సెల్ ఫోన్లు, కెమెరాలు, స్పై కెమెరాలు లాంటివి తీసుకురాకూడదని, ఇక్కడ విధులు నిర్వహించు సిబ్బందికి కచ్చితంగా ఐడి కార్డును ధరించవలసి ఉంటుంది అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. ఈవీఎం గోడౌన్ లో బయటి ప్రక్కన కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీటి ఫుటేజ్ నీ పోలీసు వారు పర్యవేక్షిస్తుండాలని తెలియజేశారు. అనంతరం గొడోన్ పక్కనే ఉన్న ఔట్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ కే మధుసూదన్ రావు, ఆర్డీవో హరి ప్రసాద్,ఈవీఎం ల FLC(ఫస్ట్ లెవెల్ చెకప్) నోడల్ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author