శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రులు
1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీమాత్రే నమః శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి సందర్బంగా ఈ రోజు ప్రాతఃకాలంలో శ్రీ మహాగౌరీ అమ్మవారికి విశేష అభిషేకము అర్చనలు జరిగినవి మరియూ గణపతి పూజ, పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం, సర్వతోభద్ర మండల యోగినిగణ మండపస్థాపనం నవగ్రహ కలశ స్థాపనం నవదుర్గా కలశ స్థాపనం అంగ, ఉపాంగ, ప్రత్యంగ దేవతా సహిత లలితా త్రిపుర సుందరీ ప్రాధాన కలశస్థాపనం జరిగినవి. దేవి ఖడ్గమాల లలితా సహస్ర నామార్చనలు జరిగినవి. అనంతరం చండీహోమం జరిగినది. తిరిగి సాయంకాలం ప్రదోషకాలంలో షోడశోపచార పూజ లలితా సహస్రనామార్చనలు జరిగినవి. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగినది.


