ప్రపంచ అనస్థీషియా దినోత్సవ కార్యక్రమం
1 min read– ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు వైద్య కళాశాల న్యూ లెక్చరర్ హాల్ నందు ప్రపంచ అనస్థీషియా డే కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.ప్రపంచ అనస్థీషియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనస్థీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు అని తెలిపారు.ప్రపంచ అనస్థీషియా డే పురస్కరించుకొని పలు వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రిలోని పేషంట్స్ కు ఎటువంటి సర్జరీ చేయాలనుకున్న అనస్తీసియా వైద్యుల పాత్ర కీలకమని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూల్ వైద్య కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్, డా.హరిచరన్, ఆసుపత్రి CSRMO డా.వెంకటేశ్వరరావు, ఎమర్జెన్సీ హెచ్వైడి, డా.రామ్ శివనాయక్, అనస్థీషియా Hod, డా.విశాల, మరియు కర్నూలు వైద్య కళాశాల పూర్వపు వైద్యులు, డా.సుదీర్, డా.నరసింహారెడ్డి, డా.రామకృష్ణ, డా.రాంబాబు, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.