గిడుగు రుద్రరాజు ను విమర్శించే స్థాయి గుప్తాకు లేదు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: గౌరవనీయులైన. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన గిడుగు రుద్రరాజు ను విమర్శించే స్థాయి గుప్తాకు లేదు.. ఏపీసీసీ కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ గుప్తా మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పై విమర్శలు చేయడం చాలా బాధాకరం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సిఫారసు మేరకు మన మాజీ డిసిసి సుధాకర్ బాబు గారిని వారు పార్టీ కోసం చేసిన కృషి చూసి మన పిసిసి అధ్యక్షులైన గిడుగు రుద్రరాజు గారు మాజీ డిసిసి అయినా సుధాకర్ బాబు గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం చేయడం చాలా సంతోషకరమైన విషయం. కానీ సత్యనారాయణ గుప్తా గారు మన రాష్ట్ర అధ్యక్షులు పై నోటికి వచ్చినట్లు మాట్లాడడం చాలా బాధ కలిగిందని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా అన్నారు. పార్టీ అధిష్టానం ధిక్కరించే వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కర్నూలు జిల్లా కొత్త డిసిసిగా బాబురావు గారిని నియమించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా చెప్పడమైనది. కర్నూలు జిల్లా డీసీసీ గారు ఆయన బాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని కచ్చితంగా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ కి మాజీ మంత్రివర్యులు సి డబ్ల్యూ సి సభ్యులైన డాక్టర్ రఘువీరా రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రివర్యులు మన పిసిసి అధ్యక్షులు శ్రీ గిడుగుర రుద్రరాజు గారి నాయకత్వంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా ధీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్ర అధ్యక్షులు అందరికీ సమానమైన పదవులు కేటాయించడం అలాంటి వ్యక్తిపై నింద వేయడం సరైన పద్ధతి కాదని సత్యనారాయణ గుప్త పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బోయా నాగరాజు. కోనేరు ధర్మయ్య. జోగి సుభాన్. హెచ్ సిద్ధమల్ల హెచ్ పరసప. గిరి. గఫర్ సాబ్. ఎం ఖలీల్. రాజు. పీరా సాబ్. నబి సాబ్. యూ నోస్ మొదలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.