PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు టౌన్  సీఐ గా ప్రకాష్ కుమార్ బాధ్యతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు టౌన్ సీఐ గా జి.ప్రకాష్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.గతంలో ఈయన శ్రీశైలం టూ టౌన్ , మంత్రాలయం పోలీస్ స్టేషన్లలో ఎస్సై గా విధులు నిర్వహించారు. తిరుపతి జిల్లాలో బాక్రపేట పోలీసు స్టేషన్ సబ్  ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పదోన్నతి పొంది తిరుపతి  నుండి నంద్యాల జిల్లా నందికొట్కూరు టౌన్ పోలీసు స్టేషన్ కు  సీఐ గా  బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  సోమవారం  నందికొట్కూరు పోలీసు స్టేషన్ నందు  భాద్యతలు స్వీకరించిన అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్ ను జిల్లా పోలీసు కార్యాలయం లో  పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

About Author