విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. దసరా సెలవులు సందర్భంగా పత్తికొండ శాఖ గ్రంధాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ విజ్ఞాన శిబిరంలో ఆయన విద్యార్థులతో పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్కూల్ మండ్రో పేట ప్రధానోపాధ్యాయులు కాసిం సాహెబ్ గ్రంథాలయ విజ్ఞాన శిబిరానికి హాజరై విద్యార్థిని విద్యార్థులకు సంఘంలో గురుకుల ప్రాధాన్యతను వివరించారు. ఎంతటి డాక్టర్, సైంటిస్ట్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నత పదవులు అలంకరించినను పాఠశాలలో గురువులు బోధించే పాఠ్యాలు, మంచి క్రమశిక్షణతో మిలిగే విధంగా వారిని ఉన్నత స్థానంలో నిలవడానికి కారణము ఒక గురువేనని ఉన్నారు. అందుకే ఆచార్యదేవోభవ అని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో , పాత్రికేయులు పరవస్తు గోపాల్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులు మంచి నడవడికతో ఎలా నడవాలో విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రంధాల సహాయకురాలు నాగరత్నమ్మ మరియు సుమారుగా 40 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.