PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్య నారాయణ స్వామి దేవాలయంలో  శరన్నవరాత్రులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీమాత్రే నమః శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి సందర్బంగా ఈ రోజు ప్రాతఃకాలంలో శ్రీ మహాగౌరీ అమ్మవారికి విశేష అభిషేకము, అర్చనలు జరిగినవి. మహా గౌరీ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి. మంటపారాధన దేవి ఖడ్గమాల లలితా సహస్రనామాలతో అర్చన చేయడం జరిగినది. అనంతరం నవ చండి హోమం భాగంగా చండీహోమం జరిగినది. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగినది.

About Author