ముఖ్యమంత్రి పర్యటనలో పటిష్ఠమైన భద్రత కల్పించాలి
1 min read– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు/ఎమ్మిగనూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు పర్యటనలో పటిష్ఠమైన భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులను ఆదేశించారు.ఎమ్మిగనూరు కు ముఖ్యమంత్రి రాక సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి ASL (Advance Security Liason) నిర్వహించారు. తొలుత హెలిప్యాడ్, అనంతరం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు..ఈ సందర్భంగా తీసుకోవల్సిన భద్రతా చర్యలపై కలెక్టర్, ఎస్పీ చర్చించారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్,ఎస్పీ పోలీసు అధికారులకు సూచించారు.అనంతరం బహిరంగ సభ వేదిక పై ఏర్పాట్లపై కలెక్టర్ ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తో చర్చించారు.. వేదికపై ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో ఉన్న కంపార్ట్మెంట్ లలో విఐపిలకు, పాత్రికేయులకు, మిగతా కంపార్ట్మెంట్లను జగనన్న చేదోడు లబ్ధిదారులకు, ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సభా ప్రాంగణానికి వచ్చే వారికి ఎండ తీవ్రత దృష్ట్యా త్రాగు నీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంగణమంతా శుభ్రంగా ఉండే విధంగా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. విద్యుత్, ఫైర్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్స్, పటిష్ఠమైన బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.