హెచ్వోడీలతో సమీక్ష సమావేశం
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల HODs తో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆస్పత్రిలోని ప్రతి మంగళవారం అన్ని విభాగాల హెచ్వోడీస్ లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఆసుపత్రిలోని పలు విభాగాల ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ లపై ఆరా తీశారు అనంతరం పలు విభాగాలలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ ల పై అసహనం వ్యక్తం చేశారు.ఆస్పత్రిలోని పలు ఒపి మరియు ఐపి విభాగాలను పీజీ స్ మరియు అసిస్టెంట్స్ లతో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధించిన Hods కి ఆదేశించారు.ఆసుపత్రికి ఎవరైనా పిజిస్ హాజరు కాని వారు ఎవరైనా ఉంటే స్టైఫండ్ కట్ చేస్తామని తెలిపారు.ఆసుపత్రి లో త్వరలో ఓపి విభాగాలలో అకస్మిక తనిఖీ చేస్తాను అని హెచ్చరించారు.MRD మెడికల్ అండ్ రికార్డ్ సెక్షన్ లో బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లలో తప్పులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని (MRO) మెడికల్ రికార్డ్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ను ఆదేశించారుఆసుపత్రిలోని వచ్చే పేషెంట్లకు ముందుగానే ఆధార్ కార్డు లో ఉన్న పేరు మరియు అడ్రస్ ఆధారంగా ఆధార్ ఉన్న దాని ప్రకారంగా ఒపి మరియు కేసిట్ లలో పొందుపరచాలని సంబంధించిన విభాగాల HODs కి ఆదేశించారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, CSRMO డా.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.ఇక్బాల్ హుస్సేన్, డా.హరి చరణ్, డా.శ్రీనివాసులు డా.సీతారామయ్య, డా. శ్రీలక్ష్మి బాయ్, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్,తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, గారు తెలిపారు.