PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సఫాయి కార్మిక చట్టం అమలు..

1 min read

– కార్మికుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత అధికారులపై ఉంది..

– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

 – పురపాలక కమీషనర్లతో కలెక్టర్ సమీక్ష

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలలోని పారిశుధ్య కార్మికులకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పురపాలక సంఘాల కమిషనర్లతో కలెక్టర్ వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ సఫాయి కర్మచారి చట్టం కింద పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత అధికారులపై ఉందన్నారు.  వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా  మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాలలో పూర్తి పారిశుధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.   పారిశుధ్య కార్మికులకు అవసరమైన చెప్పులు, రెయిన్ కోట్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.  పారిశుధ్య కార్మికులకు ఈ.ఎస్.ఐ కార్డులు అందించే విషయాన్నీ పరిశీలించాలని, పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్సు అందించాలని, చనిపోయిన, రిటైర్డ్ కార్మికులకు ప్రోవిడెంట్ ఫండ్ అందించాలన్నారు. పట్టణ ప్రాంతాలలో జగనన్న ఆరోగ్య  సురక్ష కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి: కలెక్టర్:జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పురపాలక సంఘాలలోని ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.  ఆరోగ్య సురక్షా క్యాంపులకు ఆ ప్రాంతంలోని ప్రతీ ఒక్కరూ హాజరయ్యేలా వాలంటీర్లు, ఏ .ఎన్ .ఎం. లు చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రజలకు ప్రాధమికంగా నిర్వహించే డయాబిటిస్, రక్తపోటు, రక్తహీనత కు సంబంధించి పరీక్షలు నిర్వహించాలని, పరీక్షలలో ఏదైనా దీర్ఘకాలిక రోగాలు గుర్తించినట్లయితే వెంటనే వారిని  నెట్వర్క్ ఆసుపత్రులకు తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, నూజివీడు అబ్దుల్ రషీద్, జంగారెడ్డిగూడెం భవాని ప్రసాద్, చింతలపూడి రాంబాబు  మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. శర్మిష్ఠ , డి.ఎల్.డి ఓ రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author