NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆర్థర్.. డీకే అరుణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి.మంగళవారం ఉదయం నుంచి శ్రీశ్రీశ్రీ సుంకులా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు అమ్మవారికి గణపతి పూజ అభిషేకము కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ గ్రామానికి వచ్చిన వెంటనే కుమారస్వామి ఆధ్వర్యంలో టపాకాయలు కాలుస్తూ డ్రమ్స్ నడుమ ఘనంగా పూలమాలలతో ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలుకుతూ ఊరేగింపుగా దేవాలయం వరకు వెళ్లారు.సుంకులా పరమేశ్వరి దేవి అమ్మవారిని ఎమ్మెల్యే మరియు  మాజీ మంత్రి తెలంగాణ గద్వాల బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.గత ఐదు సంవత్సరాల నుండి జ్యోతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు.వివిధ గ్రామాల నుంచి భక్తాదులు మహిళలు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు.వచ్చిన వారందరికీ భోజన వసతిని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మదార్ సాహెబ్,చంద్ర శేఖరప్ప వివిధ గ్రామాల నాయకులు వీరారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,జాన్,వైసీపీ జిల్లా కమిటీ నాయకులు ఇ నాయతుల్ల,బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై ఓబులేష్,ఏఎస్ఐలు సుబ్బయ్య, హరిప్రసాద్ సిబ్బంది సలాం తదితరులు పాల్గొన్నారు.

About Author