విజయదశమి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
1 min read– జమ్మి చెట్టు వద్ద విద్యుత్ దీపాల అలంకరణలు.
– భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకొని పట్టణంలోని జమ్మి చెట్టు (శమీ వృక్షం) దగ్గర ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి బుధవారం పర్యవేక్షించారు.విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టు (శమీ వృక్షం) దగ్గర ప్రత్యేక పూజల నిమిత్తం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు పనులు చేపట్టారు. పట్టణ ఎస్సై యన్.వి రమణ జమ్మి చెట్టు వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు బద్దుల శ్రీకాంత్, నందికొట్కూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా విజ్జి, నంద్యాల జిల్లా శాప్ కో-ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్, రిటైర్డ్ ఎంఈవో సుబ్బారాయుడు, కాళ్ళూరి శివప్రసాద్, బన్నూరు ఎల్లారెడ్డి, అచ్చెన్న, చింతా నాగరాజు, ఆర్ట్ శ్రీను, రజిని కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.