దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలి
1 min read– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్ రావు*
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ లో పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య మాట్లాడుతూ భారతదేశంలో ఐదు రాష్ట్రాలలో జరగబోతున్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో Aicc అధ్యక్షులు మల్లికార్జున ఖర్కే నాయకత్వంలో దేశ వ్యాప్తంగా భారత్ జొడో పాదయాత్ర నిర్వహించి యువ నాయకులు రాహుల్ గాంధీ గారి భరోసాతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదే స్ఫూర్తితో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చి రాహుల్ గాంధీ బహుమతి అందించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో రెండవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ* ముందుగా నాకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించి రెండవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర రథసారథి పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజుగారికి CWC మెంబర్ డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారికి కార్యనిర్వహక అధ్యక్షులు గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి గారికి తులసి రెడ్డి కి డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్కి కాంగ్రెస్ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే ఈరోజు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగర మోగింది ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సందర్భంగా మోడీ మీడియా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మీద అసత్యపు ఆరోపణలు సోషల్ మీడియాలో విపరీతంగా రావడం జరుగుతుంది ఎందుకంటే గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరంలో బిజెపి ప్రభుత్వం అపద్దాల మీదనే కాలం వెల్లబుచ్చింది ఈ దేశాన్ని ఏమాత్రం కూడా ప్రగతి వైపు తీసుకు వెళ్లకుండా కులాలు మతాల మధ్యన చిచ్చు పెడుతూ దేశ పురోగతికి అడ్డుపడిన పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి ప్రభుత్వం మాత్రమే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్ పరంగా చేయడానికి మొగ్గు చూపుతూ వారు చేస్తున్న ఆకృత్యాలు మనం చూసాం అందుకే ఈసారి రాబోయే ఎలక్షన్లలో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎలా అయితే మనకు ఇక్కడ BJP అంటేB బాబు J జగన్p పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు బిజెపి కొరకు పోటీపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరిచిపోయిన సంగతి మనందరికీ తెలుసుమన ప్రక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో తెలంగాణను తీసుకుంటే అటు బీఆర్ఎస్ వాళ్ళు MiM వాళ్లు ఇద్దరు కూడా బిజెపికి పనిచేస్తున్న వ్యక్తులే అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం ప్రతి రాష్ట్రాల్లో కూడా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భరోసా కల్పించారు ఈ దేశంలో కులాలు మతాల మధ్యన చిచ్చు పెడుతూ విష ప్రయోగాలు చేస్తున్న పార్టీలకు స్వస్తి చెప్పి వారిని ఇంటికి సాగనం పోవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ప్రేమపూర్వకంగా నడిపించే పార్టీ ఈ దేశానికి అవసరమని భారత్ జోడో యాత్ర ద్వారా భరోసా కల్పించారు ఈ దేశంలో కావాల్సింది ప్రేమపూర్వకమైన ప్రభుత్వాలు కావాలి అని ఒక విద్వేష భరితమైన ప్రభుత్వాలు కాదు అని నిరూపించిన వ్యక్తి యువ నాయకులు రాహుల్ గాంధీ మనం చూస్తున్నాం ఎన్నో సందర్భాల్లో పెద్దలను ఎలా గౌరవించాలో యువ నాయకులు రాహుల్ గాంధీ నిరూపించారు AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పట్ల రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే దేశ ప్రజలందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి అన్నదానికి నిదర్శనం ఇదే మనం చూస్తే బీజేపీ ప్రభుత్వం లో ఉన్న నరేంద్ర మోడీ వాళ్ళ పెద్దలపట్ల ఏ విధంగా వ్యవహరించారు ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అద్వానీ అటువంటి మహా యోధులునే అవమానించే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అందుకే భారతదేశంలో కూడా ప్రజలందరినీ కోరుతున్నాను ఈ రోజు పెద్దలను గౌరవించండి అన్ని కులాలను గౌరవించండి అన్ని మతాల వారిని గౌరవించండి మనకు కులాల మధ్య చిచ్చు పెడుతూ గొడవలు రేపుతున్న వారిని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి ఐదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అని చెప్పి మరి అందరిని కోరుకుంటున్నాంఈ కార్యక్రమంలో APCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి చింతలయ్య, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, జిల్లా మైనారిటీ సీనియర్ నాయకుడు చాబోలు సలాం, యూత్ కాంగ్రెస్ నాయకులు పసుపుల అజయ్ కుమార్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.