PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన చావడిని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

1 min read

గ్రామ అభివృద్ధి పనులు వైసీపీతోనే సాధ్యం.వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి

పల్లెవెలుగు వెబ్  కౌతాళం : మండల పరిధిలో పొదలకుంట గ్రామంలో బుధవారం నూతన చావడి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ప్రారంభించారు.అనంతరం చావిడి శిలాఫలకం ఆవిష్కరించి,రిబ్బన్ కత్తిరించి,ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా వైఎస్ ఎంపిపి రామలింగయ్య స్వామి అలియాస్(బుజ్జి స్వామి) మాట్లాడుతూ మంత్రాలయం నియోజవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వాటిలో 10 లక్షలతో పొదలకుంట చావిడికి,కౌతాళం ఎల్ఎల్సి కాలువ నిర్మాణ పనులు,సులేకేరి,బంటకుంట డ్రైనేజీ సమస్య మొదలైన అభివృద్ధి పనులు గ్రామాల్లో ఎన్నడు లేని విధంగా చేశామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమ్రేష్ గౌడ్, మండల నాయకులు ప్రహ్లాద ఆచారి,సర్పంచ్ పాల్ దినకర్,ఉప సర్పంచ్ సక్రి తికయ్య,వడ్డే రామన్న, వైసిపి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

About Author