శరన్నవరాత్రి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండల పరిధిలోని మాన్ దొడ్డి గ్రామ పొలిమేర పెద్ద మ్మ బుధవారం చండీకదేవి గా అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు గిరిస్వామి మాట్లాడుతూ ఈ అమ్మవారిని కొలిచిన వారికి కొంగు బంగారం గావించి, కోరిన కోర్కెలు తీర్చే మహా శక్తి అని ఆయన చెప్పారు. దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజులు పొలిమేర పెద్దమ్మ కు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, అందులో భాగంగా మహా మంగళ హారతి, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త లు ఎల్.రామిరెడ్డి ,అరుణ దంపతుల అధ్వర్యంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.గ్రామంలోని ప్రజలు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటు, తీర్థప్రసాదాలు స్వీకరించారని అలయ అర్చకులు తెలిపారు.