PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కష్టపడి చదివి లక్ష్యాలను చేరుకోవాలి..

1 min read

– జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి

– బాలికలు వ్యక్తిగత సామాజిక అభివృద్ధి పెంపొందించుకోవాలి..

– చైల్డ్ ప్రొటెక్షన్ మెoబర్ డాక్టర్:రాజేంద్రప్రసాద్

 పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ యూనిట్ కార్యాలయము ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పొలసానిపల్లి  భీమడోలు మండలంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన  బి. లావణ్య వేణి, ఐ.ఏ.ఎస్  బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ బాలికలు వారి యొక్క హక్కులను  చట్టాలను మరియు ఆరోగ్య సంరక్షణ న్యూట్రిషన్ విషయాలపై  అవగాహనను కలిగి ఉండాలని బాగా కష్టపడి చదువుకుని   ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా  ఏలూరు జిల్లా ట్రైనీ కలెక్టర్ గారు అయిన కుమారి శ్రీ పూజ, ఐ.ఏ.ఎస్ వారు మాట్లాడుతూ బాలికలు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి తమను తాము   సంరక్షించుకోవాలని నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉండాలని బాలికలకు సూచించారు. ఆంధ్ర ప్రదేశ్  స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఫర్ రైట్స్ (AP SCPCR) మెంబర్ అయినటువంటి డాక్టర్:జంగం రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ బాలికలు వ్యక్తిగత సామాజిక అభివృద్ధి పెంపొందించుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్ ను కలిగి ఉండాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిత  ఇన్చార్జ్ అధికారి కె. విజయలక్ష్మి  మాట్లాడుతూ  బాలికలు శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి అభివృద్ధి చెందాలని బాల్యవివాహ నిషేధ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి  అయిన డాక్టర్. సి.హెచ్. సూర్య చక్రవేణి  మాట్లాడుతూ బాలికలు విద్య వైద్య ఆరోగ్య ఇతర సామాజిక  అభివృద్ధి రంగాలలో ముందుకు వెళుతూ  భావి పౌరులుగా  సమాజాన్ని తీర్చిదిద్దాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎన్. సంజీవరావు, డి. సి. ఓ.  రెసిడెన్షియల్, ఎ.డి. డిజేబుల్ వెల్ఫేర్ , ప్రభాకర్ , సి. డబ్ల్యూ .సి. చైర్ పర్సన్  బి. రిబ్కారాణి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఎం. పద్మావతి,  క్రాఫ్ ఎన్జీవో కోఆర్డినేటర్ రవి, డిఎన్. రత్నం మరియు ఈ.వో (డి ఎం అండ్ హెచ్ ఓ), గురుకుల పాఠశాల టీచర్లు  సిబ్బంది ,డిసిపియు, చైల్డ్ లైన్   సిబ్బంది,తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్  ఎడ్యుకేషన్ ఎస్సే రైటింగ్ మరియు ప్రివెన్షన్ ఆఫ్  చైల్డ్ మ్యారేజెస్ ఎలక్యూషన్లలో గెలుపొందిన విద్యార్థులకు గౌరవ అతిధులు జాయింట్ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ మరియు ఎస్సిపిసిఆర్ మెంబర్ వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగినది. అదేవిధంగా విన్నర్ ఆఫ్ స్టేట్ లెవెల్ జగనన్న ఆణిముత్యాలు అండ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ యూ.ఎస్.ఏ విజిటెడ్ ఏపీ టీం అయిన కుమారి. డి. జోష్నకు జాయింట్ కలెక్టర్ వారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగినది.

About Author