జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం..
1 min read– సుమారు 500 మంది పేషెంట్లుకు ఆరోగ్య పరీక్షలు
– పేషంట్లకు ఉచిత భోజన ఏర్పాట్లు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : స్థానిక కండ్రిగూడెం 27వ డివిజన్ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 27వ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ బత్తిన విజయకుమార్ మరియు ఎంపీడీవో బి ప్రణవి, హల్త్ ఆఫీసర్ మాలతి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. ఆరోగ్య పరీక్షలకు సుమారు 500 మంది పేషెంట్లు హాజరై వారి ఆరోగ్యం పరీక్షలు చేయించుకుని శిబిరంలో సుమారు 29 రకాల వ్యాధులకు 105 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మందులు తీసుకొని వెళ్లారు. కంటి పరీక్షలు, గుండె పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ చెక్ అప్ ఎలా పలు రకాల వ్యాధులను చెకప్ చేయించుకొని మందులు కళ్లద్దాలు తీసుకొని సంతోషంగా వెళ్లారు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న వారికి భోజన ఏర్పాట్లు చేశారు, వార్డు అడ్మిన్ సెక్రెటరీ బి లోకనాథ్ పర్యవేక్షించగా ఈ కార్యక్రమానికి 29వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ సుజిత సన్నీ వైసిపి నాయకులు నున్నా కిషోర్, మరియు తంగిరాల అరుణ సురేష్, కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారధులు, సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.