దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
1 min readచౌడేశ్వరి ఆలయంలో శ్రీ సరస్వతి దేవి అలంకారం.
రామనపల్లెలో కలశ బిందెలతో అమ్మవారి గ్రామోత్స వం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: దసరా శరన్నవరాత్రు ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన చెన్నూరులో దసరా ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు,ఆరవ రోజు శుక్రవారం చెన్నూరు శ్రీ రామలింగ చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి గణపతి పూజ అభిషేకములు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు,ఆరవ రోజు కూడా వివిధ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు, ముఖ్యంగా మండలంలోని రామనపల్లి గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు గ్రామంలోని పురవీధులలో కలశ చెంబులతో గ్రామోత్సవం నిర్వహించారు, మూలా నక్షత్ర సందర్భంగా శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయం నందు వేద పురోహితులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, నిర్వహించారు. కుంకుమార్చనకు మహిళల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం ఆలయం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.