దుర్గా ఘాట్ వద్ద నిమజ్జనం పనులు పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేవి శరన్నవరాత్రుల వేడుకల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఈ బుధవారం జరగనుంది. నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న తుంగభద్ర నది తీరంలోని దుర్గా ఘాట్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్వయంగా పరిశీలించారు .ఈ సందర్భంగా దుర్గా ఘాట్ వద్ద నిమజ్జనం సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు .అలాగే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటికే దుర్గా ఘాటు వద్ద పారిశుద్ధ పనులతో పాటు దుర్గా ఘాట్ ను సుందరంగా అలంకరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని సంకల్ భాగ్ లో ఉన్న దుర్గా ఘాట్ వద్ద బుధవారం సాయంత్రం జరిగే అమ్మవారి విగ్రహాల ఊరేగింపు ,నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు.