NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఇల్లు సామాగ్రి దగ్ధం

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : చెన్నూరు బెస్త కాలనీలో సోమవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ లీకేజై మంటలు వ్యాపించడంతో ఇంటితోపాటు, ఇంట్లోని సామాను లు, బట్టలు, నగదు, దగ్ధమయ్యాయి, బాధితుడు వర్ధ బోయిన వెంకటసుబ్బయ్య కుటుంబ కట్టుబట్టలతో రోడ్డు పడినట్లు స్థానికులు బాధితులు తెలిపారు, మత్స్యకారుడైన వర్ధ బోయిన వెంకటసుబ్బయ్య, చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు, ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆయన భార్య పిల్లలు ఇంట్లో ఉండగా వంట గ్యాస్ లీకేజీ అయి దట్టంగా మంటలు వ్యాపించడంతో వారు అరుచుకుంటూ బయటికి పరిగెత్తడం జరిగిందని బాధితులు, స్థానికులు తెలిపారు, కాగా ఈ ప్రమాదంలో బాధితునికి సంబంధించిన నగదు, బట్టలు, బీరువా, ఫ్యాన్లు, కూలర్లు, కాలి బూడిద అయినట్లు వారు తెలిపారు, ఆ సమయంలో స్థానికులు కడప ఫైర్ ఇంజన్ వారికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు, అయితే అప్పటికే సర్వం కోల్పోయి బాధితులు రోడ్డున పడినట్లు గ్రామస్తులు తెలిపారు, ఏది ఏమైనప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, అయితే వ్యాపారానికి పోనితే పూట గడవని ఆ కుటుంబం అన్ని విధాల నష్టపోయిందని, ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకొని నష్టపరిహారం అందించడంతోపాటు, ప్రభుత్వ పక్క గృహం కూడా మంజూరు చేయాలని వారు కోరారు.

About Author