దేవీ శరన్నవరాత్రి వేడుకలను మరింత గొప్పగా నిర్వహిస్తాం.. టీజీ వెంకటేష్
1 min readపల్లెవలుగు వెబ్ కర్నూలు: నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్ లో టీజీవి కళాక్షేత్రం, గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవి శరన్నవరాత్రుల ఉత్సవ మండపాల ముఖ్య నిర్వాహకుల సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ బుధవారం నాడు నగరంలోని సంకల్ భాగ్ వద్ద ఉన్న దుర్గా ఘాట్ లో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని వివరించారు. 1974 వ సంవత్సరంలో పేపర్ మిల్లు ఏర్పాటు చేసేందుకు కర్నూలు వచ్చిన తాను అప్పట్లోనే హైదరాబాదులో మాదిరి కర్నూలులో గణేష్ మహోత్సవాలు నిర్వహించేందుకు మిత్రుల తో మొదలు పెట్టామని చెప్పారు. అలాగే శ్రీశైలంలో శివాజీ మెమోరియల్ సెంటర్ ఏర్పాటుతోపాటు స్విమ్మింగ్ పూల్ తదితర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. నగరంలో గీతా ప్రచార సంఘం ద్వారా అప్పట్లోనే ప్రవచనాలు చెప్పే కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. విజయవాడలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని కర్నూల్లో కూడా దేవి శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని వివరించారు. నగరంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అనంతరం ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. . మనది సనాతన ధర్మం అని వృత్తులను బట్టి కులాలుగా విడిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పారు. కులాలను పక్కనపెట్టి అందరూ ఒకటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆయా సామాజిక వర్గాల్లో వెనుకబడిన వారిని ఆదుకోవడం చేయాలని అంతేగాని కులాలు గా విడిపోయి రాజకీయాలు చేయరాదని చెప్పారు.దుర్గా ఘాట్ వద్ద ఆడిటోరియం ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక ఈ నెల 25వ తేదీ జరిగే దుర్గ మాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమములో పాల్గొనేందుకు విగ్రహాల ఊరేగింపులు వీలైనంత త్వరగా చేపట్టాలని, తద్వారా వీలైనంత త్వరగా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించి అందరూ ఇల్లుకు చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దుర్గామాత నిమజ్జనం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గంగా హారతి కార్యక్రమం ఉంటుందని వివరించారు .ఈ కార్యక్రమంలో దాశెట్టి శ్రీనివాసులు, పత్తి ఓబులయ్య, గోరంట్ల రమణ, చంద్రశేఖర్ శర్మ ,ఎస్.కె మహేష్ ,రామస్వామి,సందడి మహేష్, విటల్ శెట్టి, చల్లా దామోదర్ రెడ్డి,రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.