PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసమానతలు లేని అభివృద్ధి కై సీపీఎం పోరాటం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అసమానత లేని అభివృద్ధి కోసం ఉద్యమిద్దామని, సిపిఎం పార్టీ రాబోయే రోజుల్లో అటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుందని సిపిఎం జిల్లా నాయకులు బి వీర శేఖర్, మండల నాయకులు సూరి మహబూబ్ బాషా లు పేర్కొన్నారుు. గురువారం నాడు రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అసమానతులేని అభివృద్ధి కోసం చేపట్టిన బస్సు యాత్ర ఈనెల 30 తేదీన ఆదోనిలో ప్రారంభమై నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ తో ముస్తుందని తెలిపారు. బహిరంగ సభ విజయవంతం మండలంలోని  సాగునీటి సమస్య పరిష్కారం కోసం పంట కాలువల నిర్మాణం, కరువు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం  మండల కమిటీ ఆధ్వర్యంలో దేవనకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆటో జాతను ఆ పార్టీ సీనియర్ నాయకులు బజారి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యుల అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుల కుప్పగా మిగిలిందని, రాష్ట్ర విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని నమ్ముకున్న చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  ప్రజా  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబండ ప్రాంతాల అభివృద్ధి జాతీయ ప్రాజెక్టుల సాధనలో చితికిల పడ్డాడని  ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారని వారు విమర్శించారు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధికి నిధులు సాధించలేకపోయారని ఉద్యోగాలు ఇవ్వలేక ఉపాధి అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని అన్నారు.అధికారo చేపట్టిన తర్వాత కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసే చట్టాలకు మద్దతిస్తూ, ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు ప్రజల సంపదను అప్పగిస్తున్నారని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతున్న  ప్రశ్నించకపోగా వివిధ పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేసు కుంటున్నారని విమర్శించారు. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఓట్లేస్తే కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులను ఇవ్వకుండా నవరత్నాల పేరుతో  మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జాత దేవనకొండ పల్లె దొడ్డి ,వెంకటాపురం , నేలతల మరి,  గుండ్లకొండ, గుడిమరాళ్ల ,బంటుపల్లి, బేతపల్లి, కోటకొండ, నెల్లిబండ ,పాలకుర్తి, తెర్నేకల్లు ,కుంకనూరు ,పొట్లపాడు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా 30వ తేదీన పత్తికొండలో అంబేద్కర్ సర్కిల్లో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ,ఈ బహిరంగ సభకు జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ గఫూర్ గారు పాల్గొని ప్రసంగిస్తారు, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జాతా కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుంకన్న, శ్రీనివాసులు, కౌలుట్ల స్వామి, నాగరాజు, వీరన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author