ప్రభుత్వ పథకాలు వలన ప్రజలకు ఎంతో మేలు
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండలం పరిధిలో కామవరం గ్రామంలో మూడవ రోజు గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో పథకాలు అందించడం జరిగింది ఆ పథకాల గురించి తెలుసుకోవడానికి వైసిపి నాయకులు ప్రజల ఇంటి దగ్గరకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చే పథకాలు వివరించి 2024 లో వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి యువ నాయకులు ప్రదీప్ రెడ్డి, కౌతాళం మండల నాయకులు దేశాయి ప్రహల్లాదచారి, కామవరం వీరసేనారెడ్డి,మహీంద్ర రెడ్డి, సర్పంచ్ వసంత, బుజ్జి స్వామి, వడ్డె రాము, సమ్మద్, సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఫాల్గొనడం జరిగినది.